బిసీఎం10 న్యూస్ ఆగస్టు 13 కూనవరం : పోలవరం జిల్లా కూనవరం మండలం జరిగిన సమావేశానికి పాయం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మొత్తాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బాబు బొర్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఏలినోవ ప్రభావం కారణంగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వరి పంట పండించడం రైతులకు కష్టంగా మారిందని ఆయన అన్నారు. తగిన వర్షాలు లేక వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కూనవరం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. కరువు మండలంగా ప్రకటించి ప్రతి కుటుంబానికి నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీబీ-గ్రాంజి పథకం కింద ప్రతి కుటుంబానికి అదనంగా మరో 100 రోజుల ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యామ్నాయ వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు ఎరువుల, వ్యవసాయ పనిముట్లు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేయాలి , కేవలం ఆన్‌లైన్ విధానాన్ని మాత్రమే అమలు చేయకుండా, గతంలో మాదిరిగానే ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా అనేక భూములకు సంబంధించిన పట్టా పాస్‌బుక్కుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో తాతలు, తండ్రుల చనిపోయిన వారి పేర్లతో ఉన్న పట్టాలు, పాస్‌బుక్కులు కలిగిన రైతులు ఆన్‌లైన్ విధానంలో ఎరువులు పొందలేని పరిస్థితి ఉందన్నారు.కాబట్టి ఏజెన్సీ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, గతంలో మాదిరిగానే ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మడకం నాగమణి, మండల కమిటీ సభ్యులు పాయం సత్యనారాయణ, తెల్ల తమ్మయ్య మడకం జోగయ్య వీక కన్నయ్య తొండ లక్ష్మయ్య జెట్టి సత్యనారాయణ సోడే శ్రీరాములు మడకం సత్యనారాయణ మడకం రమేష్ బొడ్డు బజార్ తదితరులు పాల్గొన్నారు

0 Comments