Breaking News

Loading..

వేద పాఠశాలను తలపిస్తున్న తాత గుడి సెంటర్ ప్రాథమిక పాఠశాల.

భద్రాచలం తాత గుడి సెంటర్లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణములోనే *ఒకవైపు ప్రాథమిక విద్య మరోక వైపు పూర్వ ప్రాథమిక విద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూస్తే* అలనాడు అంకిత భావంతో గ్రామాలకు దూరంగా నిర్వహించిన వేద పాఠశాలను తలపిస్తున్నాయని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.


 పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నాడు ఆర్కస్మికంగా ఈ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు.

 ఈ పాఠశాల ప్రాథమిక స్థాయిలో 149 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక కేంద్రంలో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ పాఠశాలలో ప్రతిరోజు ఎక్సెల్ ప్రోగ్రాం కింద విద్యార్థులు *కంప్యూటర్లను వినియోగించుకొని ఆధునిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వాటిలోని మెలుకువలను అలవర్చుకొని వినియోగించుకోవడం* అందరికీ ఆదర్శమని బెక్కంటి అన్నారు.

ఈ నేపథ్యంలో *బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించడం* ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయటం ఒక ప్రత్యేకత సంతరించుకుంది.ఇదిలా ఉండగా *పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులను అంతర్గత సామర్థ్యాలను వెలుగుచూస్తూ పక్కనే ఉన్న ప్రాథమిక విద్యను పరిచయం చేస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించటం తద్యమని* ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తరగతి గదిలో *కనీస అభ్యసన సామర్ధ్యాలను సాధించని పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి* వారిలోని సామర్థ్యాలను అభివృద్ధి పదములో తీసుకురావడం ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం.ఒకే ప్రాంగణంలో *ఒక పక్క పూర్వ ప్రాథమిక విద్య మరొక పక్క ప్రాథమిక విద్య అనుసంధానం చేసి విద్యార్థులకు తరగతి గదిలో కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించటం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత* అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గ్రామ నడిబడ్డనున్నప్పటికీ పచ్చని వాతావరణంలో చక్కటి విద్యకు శ్రీకారం చుట్టిన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పాఠశాల *ప్రధానోపాధ్యాయులు పాపారావు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష్య* సేవలను వారు కొనియాడారు.ఈ నేపథ్యంలో *విద్యార్థులకు యోగ, ఆటల పోటీలలో అవగాహన కలిగించటం నైపుణ్యాలను పెంచడం* దిన చర్యలో భాగంగా నిర్ణయించటం ఈ పాఠశాల ప్రత్యేకత.ఈ కార్యక్రమంలో వీరి వెంట *క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,స్వచ్ఛ మిత్రా సేవకులు,మధ్యాహ్న భోజన నిర్వహకులు* తదితరులు పాల్గొన్నారు.


FOR ADVERTISING CONTACT 9000790313

Visit www.bcm10news.in ..

Post a Comment

0 Comments