ఖమ్మం, ఆగస్ట్ 15, బిసిఎం10 న్యూస్.
ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ బ్రాంచి కార్యాలయంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ ప్రభాకర్ ఆధ్వర్యములో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులందరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు మాట్లాడుతూ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛా స్వాతంత్ర్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫసుద్దీన్, జిల్లా కోశాధికారి పి ప్రణీత్ కుమార్, ఇతర సభ్యులు రావెళ్ల రవి కుమార్, రామకృష్ణ, లోకేష్, కె కిరణ్ కుమార్, భూక్యా ప్రసాద్, ఐ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ఇంచార్జ్ శ్రీదేవి, గంధం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments