Breaking News

Loading..

35 నుండి 40 సంవత్సరాలు దాటిన మహిళలే టార్గెట్..!!

హైదరాబాద్, ఆగస్ట్ 10, బిసిఎం10 న్యూస్.

బాగా పొగుడుతారు, చాలా కేరింగ్ చూపిస్తారు. ప్రేమ ఓలకబోస్తారు, అసలు లైఫ్ లో ఏనాడు నా భర్త నన్ను ఇంత బాగా చూసుకోలేదు అనే ఫీల్ కలుగుతుంది. నువ్వే నా ప్రపంచం అంటారు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను అంటారు. ఆ ప్రేమ మైకంలో ఈ పిచ్చి తల్లులు అన్ని చెప్పేస్తారు. ఇంట్లో విషయాలు, ఆస్తులు, డబ్బులు, భర్తతో గొడవలు ఏది దాచరు. తరువాత స్టేజి వీడియో కాల్స్, సెమీ న్యూడ్, ఫుల్ న్యూడ్, లేట్ నైట్ అంతా ఇదే గోల. కట్ చేస్తే తరువాత రెండు జరుగుతాయి. ఒకటి వాళ్ళు ఊళ్ళు దాటి వెళ్లి ఏదైనా ఓయో రూమ్ లో కలుస్తారు. తరవాత ఇల్లు వదిలి వచ్చేస్తా అంటూ ఇంటి నుండి తెచ్చిన డబ్బు నగలు సమర్పిస్తారు. వాడు మంచోడు అయితే అవి తీసుకుని పోతాడు. లేదంటే ఈమెని ఏ బ్రోకర్ హౌస్ కో అమ్మేస్తాడు. ఇక లైఫ్ లో ఆమె బైట ప్రపంచం చూడలేదు. రెండోది ఆ వీడియో కాల్స్, చాట్స్ అన్ని చూపించి నాకు సహకరించలేదు అంటే వీటిని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తా అని బెదిరిస్తారు. సమాజంలో పరువు, పిల్లల ముందు, భర్త తల్లితండ్రుల ముందు ఎలా తల ఎత్తుకుని తిరిగేది అని వారి డిమాండ్స్ తీరుస్తారు. ఫిసికల్ లేదా బంగారం, లేదా డబ్బు. ఇక తన నుండి ఏమి రాబట్ట లేము అని తెలిసాక వదిలేస్తారు. ఇవన్నీ అసలు చేస్తారు అనే ఆలోచన కూడ రానంత గుడ్డిగా నమ్మేస్తారు పాపం అమాయకులు.

'కొన్ని కొన్ని పాఠాల మూల్యం కొన్ని జీవితాలు' అనే విషయం   చాలా లేట్ గా తెలుసుకుంటారు. తన కోసం, తన కుటుంబం కోసమే భర్త పగలు రాత్రి కష్టపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని ప్రతి స్త్రీ తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటే ప్రతి ఇల్లు ఓ భూలోక స్వర్గం అవుతుంది అనడం లో రెండో మాట లేదు. అలాగే ప్రతి పురుషుడు కూడ మరో స్త్రీ వ్యామోహంలో పడే ముందు తల్లి తరవాత తల్లిలా, మనల్ని కంటికి రెప్పలా చూసుకునే మన భార్యని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాము.

Post a Comment

0 Comments