Breaking News

Loading..

ఉపాధి కార్మికులను రెండుసార్లు ఫోటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలి..వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి.


బిసీఎం 10 న్యూస్ మే 27 భద్రాచలం

 ఉపాధి హామీ కార్మికులను రెండుసార్లు ఫోటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి డిమాండ్ చేశారు. ఈరోజు భద్రాచలం పంచాయతీ పరిధిలో మనుబోతుల చెరువు నందు జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఉపాధి పని చేసే కూలీలను పని ప్రారంభానికి ముందు ఒకసారి పని పూర్తయ్యాక మరోసారి ఫోటోలు తీస్తూ సమయం అంతా వృధా చేయటం జరుగుతుందని దీనివల్ల పని సరిగా చేయలేకపోతున్నామని కూలీలు సంఘం నాయకులకు తెలిపారు. ఫోటోలు పని ప్రదేశంలో కాక ఐటిడిఏ లోని ఉపాధి కార్యాలయం నందు తీయడం వల్ల పని ప్రదేశం నుండి రెండుసార్లు ఉపాధి కార్యాలయం వరకు వెళ్ళవలసి వస్తుందని చాలా ఇబ్బంది పడుతున్నామని కూలీలు సంఘం నాయకుల వద్ద వాపోయారు. ఉపాధి పని ప్రదేశంలోనే ఫోటోలు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఎండలో నీడ లేకపోవడం వల్ల మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నీడ ఏర్పాటు చేయాలని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సౌభాగ్యం సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు..

 For ADVT / INTERVIEWS CONT : 9000790313

VISIT WEBSITE : WWW.BCM10NEWS.IN

WRITEUS:     : BCM.BHADRACHALAM10@GMAIL.COM

Post a Comment

0 Comments