Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

బిసిఎం10 న్యూస్ ఏప్రిల్ 14 భద్రాచలం

 భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆల్ ఫ్రెండ్స్ నర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్  చిత్రపటానికి అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, కోశాధికా రి డి కృష్ణమూర్తి, పూలదండను వేసి పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని తెలిపారు ఆయన ఆశయాలు సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తద్వారా కులమత రహిత భారతదేశాన్ని చూడగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్, జి. మురళీకృష్ణ, కొండలరావు, చుక్కా రాంబాబు, వి సుబ్రహ్మణ్యం, తోట కోటేశ్వరరావు, కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments