బిసీఎం10 న్యూస్ ఏప్రిల్ 11 భద్రాచలం: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహానీయ సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని పూలే గారి ఆశయాలకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు కొప్పుల రవీందర్ మాట్లాడుతూ..పూలే గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం… ఒక ఆలోచనా ధోరణి… సమానత్వం కోసం సాగిన పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళా విద్య అభివృద్ధి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం భారత సమాజ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగాలు పెరుగుతున్న ప్రైవేటు కరణ ఫీజులు పెరగటం వలన పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జ్యోతి రావు పూలే గారి ఆశయాలకు విరుద్ధంగా జరుగుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటికీ సమాజంలో అసమానతలు, విద్యలో అన్యాయం కొనసాగుతూనే ఉన్నాయని, కార్పొరేట్ విద్య విధానాలు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులను విద్య నుంచి దూరం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. పూలే గారి ఆశయాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ విధానాలను ఎస్ఎఫ్ఐ కఠినంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులు సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విద్య, హక్కులు, సామాజిక న్యాయం కోసం ఎస్ఎఫ్ఐ పోరాటాలు మరింత ఉద్ధృతం అవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్,సురేష్, రఘు, ప్రకాష్, సాయి, సుభాష్, అరుణ్, పుష్ప కుమార్, తదితరులు పాల్గొన్నారు. |
0 Comments