Breaking News

Loading..

ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ భద్రాచలం 2వ నూతన కమిటీ ఎన్నిక..అధ్యక్షుడిగా పోకల శ్రీనివాస్ ఏకగ్రీవం..


ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ భద్రాచలం నూతన కమిటీ.

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ బ్ భద్రాచలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న 20 మంది ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఏకగ్రీవంగా నూతన కమిటీను ఎన్నుకున్నారు. రెండవ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు కుప్పాల నాగరాజు,గౌరవ సలహాదారులు పూనెం ప్రదీప్ ఆధ్వర్యంలో  నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పోకల శ్రీనివాస్ (v6 news),కార్యదర్శిగా చెట్టి జస్వంత్(99టీవీ బ్యూరో),కోశాధికారి గా లంకా రాజేష్ (రాజ్ న్యూస్),ఉపాధ్యక్షుడు తమ్మల్ల రాజేష్(Y7 న్యూస్ బ్యూరో),సహాయ కార్యదర్శిగా పోలిశెట్టి రాజు(స్వతంత్ర టీవీ) ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది...గత ఏడాది మీడియా ప్రెస్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో బాధ్యతలు నిర్వహించిన మొదటి కమిటీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కొత్త కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అందరికీ అందుబాటులో ఉంటూ,ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి,అధికారులకు తెలియచేస్తూ ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది....ప్రజా సమస్యలను మీడియా ప్రెస్ క్లబ్ కి తెలియచేయాలని,మీడియా ప్రెస్ క్లబ్ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోకల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిజం అనేది బాధ్యతతో కూడుకున్నదని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేశారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని జర్నలిస్ట్ అనేవాడు ప్రజలకి అధికారులకి వారధిగా ఉండాలన్నారు. క్లబ్ తరఫున అన్ని వేళలో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments