బిసిఎం10 న్యూస్ జూన్ 7 భద్రాచలం. భద్రాచలంలోని డాక్టర్ జయరాజు గారి భార్య అయిన శ్రీమతి డి, సరోజిని విశ్రాంతవైద్య ఉద్యోగి.ఈమె గత కొన్ని రోజులుగా అనారోగ్యముతో బాధపడుతూ రాజమండ్రిలోనే తన కుమార్తె గృహములో ఉంటూ రాజమండ్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ది. 05.07.2026 ఆదివారము తెల్లవారుజామున రెండు గంటలకు తుది శ్వాస విడిచారు.ఈ మరణ వార్త తెలుసుకొని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి Dకృష్ణమూర్తి. మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు నాయకులు రాజమండ్రిలోని స్వర్గీయ సరోజిని భర్త డాక్టర్ జయరాజు గారికి ఫోను ద్వారా శ్రీమతి సరోజినీకి సంతాపం తెలిపి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.ఈ రోజు ది0 7.07.2026న భద్రాచలంలోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య అతిథిగా హాజరైన మారుతి నర్సింగ్ కళాశాల అధిపతి డాక్టర్ శ్రీ ఎస్ ఎల్ కాంతారావు.స్వర్గీయ శ్రీమతి డి సరోజిని చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.డాక్టర్ శ్రీ ఎస్ ఎల్ కాంతారావు ఈ సభలో మాట్లాడుతూ శ్రీ డాక్టర్ జయరాజు. మృతురాలు శ్రీమతి సరోజిని అనేక గిరిజన గ్రామాలలో గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించారుఅని అన్నారు.ఈ సందర్భంగా చి త్రపటానికి రిటైర్డ్ ఉద్యోగులు శ్రీమతి బాలామణి శ్రీమతి రమకుమారి. శ్రీమతి రోజా కుమారి. శ్రీమతి నాగలక్ష్మి తదితర మహిళలు మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ డివిజన కమిటీ సభ్యులు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వర్గీయ సరోజినీకి అశ్రునయనాలతో చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వైద్య ఉద్యోగులు , శ్రీ టి కోటేశ్వరరావు నాళం సత్యనారాయణ ఐ వి సత్యనారాయణ ఎం రామ్ బ్రహ్మచారి. బాల భాస్కరరావు.మరియు ఆల్ ఫెన్షనర్స్ అసోసియేషన్ నుండి సంఘం గౌరవ సలహాదారు శ్రీ మాదిరెడ్డి రామ్మోహనరావు. ఎం హరినాథ్ ఎస్ రాజబాబు, దాసు, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం విష్ణు మొలకల బద్రీనాథ్ బైరు నరసింహారావు చుక్క రాంబాబు పంపన సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది విశ్రాంత ఉద్యోగులు విశ్రాంత మహిళలు పాల్గొని శ్రీమతి సరోజినీకి అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.

0 Comments