![]() |
| భద్రాచలం బ్రిడ్జి |
భద్రాచలం–మల్కనగిరి మధ్య ప్రతిపాదిత 174 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 8,592 కోట్లను మంజూరు చేసిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు అమలులో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.ఈ రైల్వే మార్గంలో భద్రాచలం సమీపంలో గోదావరి నదిపై భారీ రైల్వే వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో భవిష్యత్తులో నీటిమట్టం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వంతెన ఎత్తు, డిజైన్‌ను సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
![]() |
| పోలవరం డ్యాం |
దీంతో వంతెన నిర్మాణ వ్యయం పెరగడం, సాంకేతిక అనుమతులు, డిజైన్ మార్పుల కారణంగా ప్రాజెక్టు అమలులో కొంత జాప్యం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాకాలంలో వరదల ప్రభావం లేకుండా ట్రాక్, వంతెన నిర్మాణానికి రైల్వే శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా భద్రాచలం ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే కల త్వరగా సాకారం కావాలంటే పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం పూర్తి చేసి, తగిన సాంకేతిక పరిష్కారాలతో ప్రాజెక్టును వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


0 Comments