బిసిఎం 10 న్యూస్ ఏప్రిల్ 6 భద్రాచలం : రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనివారు ఏప్రియల్ 15వ తేదీ లోపల మీసేవ యాప్ ద్వారా గాని జీవన్ ప్రమాణం ద్వారా గాని ఆన్లైన్లో భద్రాచలం ఎస్ టి ఓ శ్రీమతి సుభద్ర గారికి అందజేయాలని లేనియెడల ఈనెల లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి వారి పెన్షన్లు నిలిచిపోతాయని తెలియజేశారని. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలియపరుస్తూ భద్రాచలం ఎస్ టి ఓ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు ఇంకను 153 మంది ఇవ్వవలసిన వారి లిస్టు ఎస్ టి ఓ శ్రీమతి టి సుభద్ర గారు అందజేశారు.ఈ లిస్టు భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నది.. కావున ఇంకనూ ఇవ్వవలసిన వారు లిస్టులో సరిచూసుకొని 15వ తేది లోపల లైఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వవలసినదిగా కోరుతూ ఏప్రిల్ 15 దాటిన యెడల ఇవ్వనటువంటి వారి పెన్షన్లు నిలిచిపోతాయని తెలిపారు. కావున పెన్షనర్స్ మిత్రులు త్వరితగతిన అందజేసి పెన్షన్లు పొందాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. కోశాధికా రి. ది. కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు.

0 Comments