భద్రాచలంలో స్టాల్ ని ప్రారంభించిన జైలు అధికారి జిడుగు ఉపేందర్రా రానున్న రోజుల్లో మరింత విస్తరణ చేయనట్లు తెలిపారు.
జీవితం లో తప్పు చెయ్యని వారు ఉండరు... అలా అని తప్పు చేసిన వారు జైల్లో ఉంటున్నారా అంటే కానే కాదు... కొన్ని పొరపాట్లు వల్ల జైలు జీవితం గడిపేలా చేస్తుంది... అందుకే వారిలో మార్పు రావడం కోసం.... ఇంటికి వెల్లినాక ఉపాధి పొందడం కోసం జైలు సూపరిండెంట్ జైల్లో ఉపాధి వచ్చే చిన్న పరిశ్రమ ను అందు బాటులోకి తెచ్చారు... ఇప్పుడు ఆ పధకమే అగర బత్తి తయారీ కేంద్రం గా మారింది..ఈ తయారీ వారికి ఉపాధి తో పాటు వారి లో సత్ ప్రవర్తన కు మార్పు కాబోతుంది.... ఇప్పుడు భద్రాచలం లో తాజాగా అగర బత్తి స్టాల్ ను అందుబాటులో కి తీసుకు వచ్చారు.. భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న విచారణ ఖైదీలకు జీవన ఉపాధిని కల్పించాలని లక్ష్యంతో ప్రారంభించిన అగరబత్తుల తయారీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దేవాలయంలో వాడిన పువ్వులను(నిర్మాల్యం) వాడి పూర్తిగా ఆరోగ్యకరమైన పదార్థాల తో తయారు చేసి ప్రజలకు అందించేందుకు పట్టణంలోని రామాలయం ప్రాంతంలో విక్రయ స్టాల్ ని ప్రారంభించామని స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ జిడుగు ఉపేందర్ అన్నారు. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఉత్తర ద్వారం సమీపాన హెర్బల్ అగర్బత్తి స్టాల్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విచారణలో ఉన్న ఖైదీలలో పరివర్తన కల్పించే లక్ష్యంతో వారికి చేతి పనిని కల్పించామని అందులో భాగంగా అగరబత్తుల తయారీ విధానాన్ని నేర్పించి వారిచేతే స్వయంగా హెర్బల్ అగర్బత్తులను తయారు చేపించి విక్రయించేందుకు పూనుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంతో విచారణ ఖైదీలకు జీవన ఉపాధితో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన సువాసనల అగరబత్తులను అందించగలుగుతున్నామని తెలిపారు. పర్యావరణాన్ని పరీక్షించాలన్న లక్ష్యంతో హెర్బల్ అగరబతులతో పాటు భవిష్యత్తులో జూడో చేతి సంచుల తయారీ ని కూడా భద్రాచలం స్పెషల్ సబ్ జైల్లో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు అందుబాటులో ఈ హెర్బల్ అగరబత్తులను అందించడంతోపాటు ప్రతి సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సైతం ఈ స్టాల్ ని అందుబాటులో ఉంచబోతున్నామని ఆయన తెలిపారు. ఈ అగరబత్తులు విక్రయించడం ద్వారా వచ్చే లాభాలు పూర్తిగా ఖైదీలకే అందుతాయని వాటితో విడుదల అనంతరం వారు సామాన్య జీవితం గడపటానికి దోహదపడుతుందని ఉపేందర్ ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments