- రాష్ట్రాల హక్కులను లాక్కునే చర్యలు బడ్జెట్లో పెట్టిన బిజెపి.
- కార్పోరేటీకరణ, ప్రైవేటీకరణ కోసం బాటలు వేస్తున్న బిజెపి.
- భద్రాచలం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్.
బిసిఎం10 న్యూస్ 2.2.26 భద్రాచలం : 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. అని జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ అన్నారు.దేశ భవిష్యత్తును నిర్మించే విద్యారంగాన్ని ప్రాధాన్యంగా చూడాల్సిన సమయంలో, కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా పక్కన పెట్టింది. ఈ బడ్జెట్‌లో మొత్తం విద్యారంగానికి కేటాయించిన మొత్తం రూ.1,39,289 కోట్లు మాత్రమే, ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌లో సుమారు 2.6 శాతం మాత్రమే. జీడీపీలో విద్యకు 6 శాతం ఖర్చు చేయాలనే లక్ష్యానికి ఇది చాలా దూరంగా ఉంది.పాఠశాల విద్యకు కేటాయింపు - మూసివేతల మధ్య నిధుల కోత: కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తం రూ.83,562 కోట్లు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి కొనసాగుతున్నప్పటికీ, నిధుల పెంపు జరగలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే విధానం అమలవుతుండటం అత్యంత ఆందోళనకరం. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల పిల్లలకు దగ్గరలోని పాఠశాలలు లేకుండా చేస్తున్న ఈ విధానం విద్యను హక్కు నుండి దూరం చేసే ప్రయత్నంగా మారుతోంది. ఈ బడ్జెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచకపోవటం వలన ఇంకా వెనుక బడే అవకాశం ఉంది.ఉన్నత విద్యకు కేటాయింపు - విశ్వవిద్యాలయాల బలహీనత:ఉన్నత విద్య కోసం కేటాయించిన మొత్తం రూ.55,727 కోట్లు మాత్రమే. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, పరిశోధనా సంస్థల అభివృద్ధికి ఇది పూర్తిగా సరిపోదు. ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌ల తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తద్వారా నూతనంగా ఏర్పాటు చేసస్తామన్న యూనివర్సిటీల ఏర్పాటు ఈ నిధులు సరిపోవు.సాంకేతిక విద్యకు కేటాయింపు - ఉపాధి అవకాశాలకు విరుద్ధం ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఐఐటీలు, ఎనఐటీలకు సంబంధించిన సాంకేతిక విద్యా రంగానికి కేటాయింపులు సుమారు రూ.23,000 కోట్లకు పరిమితమయ్యాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సమయంలో యువతకు నైపుణ్యాలు కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. మహిళా విద్యను పెంచటానికి నూతనంగా జిల్లాకు ఒక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ దానికి అనుగుణంగా నిధులు కేటాయింపులు చేయలేదు. నూతన విద్యా విధానం (ఎనఈపి-2020) అమలు చేస్తామని చెప్పే కేంద్ర ప్రభుత్వం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఒకవైపు విద్యాభివృద్ధి అంటూనే, మరోవైపు పాఠశాలల మూసివేత, నిధుల కోత ద్వారా ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగానికి కేటాయింపులను పెంచి, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం నిలిపివేసి, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ అభివృద్ధికి మూలాధారం విద్యనే అన్న సత్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ కార్యక్రమంలో పడగ ఇందు, తుర్రం రాణి, కోసం సుమలత, మడకం రమ, బన్నీ సురేష్, కుమార్, నరేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

0 Comments