Breaking News

Loading..

నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో 3 స్వర్ణ పథకాలను సాధించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ సభ్యులు -- గాలి రామ్మోహనరావు.


బిసీఎం10 న్యూస్ 3.3.26 భద్రాచలం

 భద్రాచలం డివిజన్ చర్ల గ్రామవాసి టిఏపిఆర్పిఏ సభ్యులు గాలి రామ్మోహనరావు హైదరాబాదు నగరంలోనే కాకుండా రాష్ట్ర అంతర్రాష్ట్రస్థాయిలలో నిర్వహించిన అనేక క్రీడా పోటీలలో పాల్గొని బంగారు, వెండి, పథకాలను సాధిస్తూ క్రీడాకారుడుగా పేరు ప్రఖ్యాతలు సాధించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జనవరి 27 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 20 26 లో పాల్గొని గాలి రామ్మోహనరావు తన ప్రతిభను మరొకసారి చాటుతూ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతాకాలను కైవసం చేసుకోవడం గర్వకారణం అని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు అయిన బంధు వెంకటేశ్వరరావు తెలిపారు.పోటీల్లో భాగంగా జనవరి 27 నుంచి 31 వరకు జరిగిన జావె లి న్ త్రో, గురువారం నిర్వహించిన షాట్ పుట్ త్రో, అలాగే ఐదు వేల మీటర్ల వాకింగ్ విభాగాల్లో ఆయన స్వర్ణ పథకాలు సాధించటం విశేషం అన్నారు.అనంతరం గాలి రామ్మోహనరావు భద్రాచలం వచ్చిన సందర్భంలో ఘనంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో వారు సాధించిన బంగారు పథకాలను మరొక్కసారి మెడలో వేసి ఘనంగా సత్కరించి ఆల్ పెన్షనర్స్ నాయకులు వారికి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన తెలంగాణ రాష్ట్రానికి మరియు మన భద్రాచలం డివిజన్ కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టి ఏ పి ఆర్ పి ఏ డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి,కోశాధికారి డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, పంపన సత్యనారాయణ, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, IVV సత్యనారాయణ,బి రాజు, కిషన్రావు, చలవది శ్రీనివాస్, Vరాంబాబు, డి తిరుమలరావు, రామరాజు, చింతా రాధాకృష్ణ జగన్మోహనరావు, కన్నయ్యలాల్ టీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొని రామ్మోహనరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments