Breaking News

Loading..

బయటకు రావాలంటే భయం భయం..

  • భద్రాచలం పట్టణంలో విధివీధిన వీధి కుక్కల వీరవిహారం.. 
  •  బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు।
  • బిక్కు బిక్కుమంటూ జనజీవనం.. 
  • పట్టించుకోని అధికార యంత్రాంగం. 

 బిసిఎం10 న్యూస్ 20 02 26 భద్రాచలం

పట్టణంలో వీధి కుక్కల వీర విహారంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉదయం డ్యూటీ కి వెళ్లేవారు సాయంత్రం తిరిగి వచ్చేవారికి ఈ కుక్కల బారినపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు బయట పరిస్థితి కాకుండా కాలనీవాసుల ఇళ్ల లోపలికి కుక్కలు చేరి ఇబ్బందులు గురిచేస్తున్నాయని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళమని కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు. 

చిన్న పెద్ద లేకుండా కుక్క కాటుకు గురై హాస్పిటల్ పాలవుతున్న ప్రజలు. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనాలపై వెళ్లేవారు వెంట పడుతుండడంతో భయభ్రాంతులకు గురై కిందపడి గాయాలు పాలవుతున్నారు. వీధుల్లోనే కాకుండా రాత్రి వేళలో ఇళ్లలోకి  వస్తున్నాయని ఇలలో గట్టిగా మొరిగి నిద్ర లేకుండా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు. 

అసలే వచ్చేది ఎండాకాలం సెలవులు ఎండ తీవ్రతకి కుక్కల దాడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని గతంలో అన్నకిచోట్ల వీధి కుక్కల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలు, మరణించిన సంగతి తెలిసిందే. 

గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని అధికారులు   వెంటనే స్పందించి వీధి కుక్కల్ని అరికట్టడంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న పట్టణ వాసులు. 





Post a Comment

0 Comments