Breaking News

Loading..

నిరంతర సాధన తోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం..మాగంటి రమేష్ బాబు.


బిసిఎం10 న్యూస్ 18.02.26 భద్రాచలం

ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థులతో నిరంతర సాధన చేపించడంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని విద్యా సంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు మాగంటి రమేష్ బాబు లు అన్నారు. ఇటీవల విడుదలైన జేఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అగ్రస్థానంలో నిలిచిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థిని విద్యార్థులను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాగంటి ప్రసాద్ బాబు మాగంటి రమేష్ బాబు లు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలతో పాటు మెయిన్స్ అడ్వాన్స్ నీట్ ఎంసెట్ తదితర పోటీ పరీక్షలలో సైతం విద్యాసంస్థల విజేతలుగా నిలుస్తున్నాయని అన్నారు. విద్యార్థులలో కలిగే పరీక్ష భయం పోగొట్టేందుకు మంత్లీ టెస్టులతో పాటు వీక్లీ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులకు పరీక్షా భయం పోగొట్టేందుకు నిరంతర సాధనను అందిస్తున్నామని తెలిపారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో నిలిచి భద్రాచలం ఏజెన్సీకి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారని అన్నారు . లిటిల్ ఫ్లవర్స్  లో విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను కూడా సత్కరించడం ఆనవాయితీగా వస్తుందని ఈ విజయాలకి మూల కారణమైన తల్లితండ్రులను కూడా గౌరవించుకోవడం బాధ్యతగా గుర్తిస్తామని ఆయన అన్నారు. ఈ ఫలితాలతో మరెన్నో విజయాలు సాధించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అనుభవం అంకిత బావ తో విధులు నిర్వహించే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతోనే లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలు గత 15లుగా తిరుగులేని విజయాలు సాధిస్తున్నాయని మాగంటి రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్య తల్లిదండ్రులతో పాటు గణిత అధ్యాపకులు ఎండి బషీర్ పాల్గొన్నారు

Post a Comment

0 Comments