Breaking News

Loading..

ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్.

భద్రాచలంలోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ తె  ల్లం వెంకట రావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీతె ల్లం వెంకటరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించి మరొక్కసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల ను ఆల్ పెన్షనర్స్ నాయకులు తెలియజేసి ఇలాంటి వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో   భద్రాచలం డివిజన్ (టి ఏ పి ఆర్ పి ఏ ) భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, డివిజన్ గౌరవ అధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి ,ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, కోశాధికారి డి. కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎం హరినాథ్,ఎస్ రాజబాబు, భద్రాచలం డివిజన్ గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు, కార్యవర్గ సభ్యులు బి రాజు, మల్యాల కిషన్రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments