Breaking News

Loading..

'శ్రీ విద్యానికేతన్' లో ఘనంగా ఎల్ఎల్సి వేడుకలు.


ఖమ్మం రూరల్, నవంబర్ 18, బిసిఎం10 న్యూస్.

కరుణగిరి టిఎన్జిఓస్ కాలనిలోని 'శ్రీ విద్యానికేతన్' హై స్కూల్ లో మంగళవారం 'ప్రొపెల్ ఎల్ఎల్సి (లెనర్స్ ఎల్ఈడి కాన్ఫరెన్స్)' వేడుకలను అకడమిక్ ఆక్టివిటీ లో భాగంగా ఉత్సాహంగా, ఆనందభరితంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తమ ప్రతిభను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు, క్విజ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, క్రీడా కార్యక్రమాలు వంటి వివిధ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నగారు, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాల కరెస్పాండెంట్ రేఖా సత్యనారాయణ యాదవ్, ప్రిన్సిపాల్ రేఖ శ్రీలక్ష్మి హాజరయ్యారు. విద్యార్థుల నవ్వులు, చప్పట్లతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 'పిల్లలే రేపటి దేశ సమాజ నిర్మాతలు, ప్రతి విద్యార్థిలో ఒక మహత్తరమైన స్వప్నం దాగి ఉంటుంది వారికి స్ఫూర్తిని, విద్యను, విలువలతో కూడిన మార్గదర్శనం అందించడమే మన (ఉపాధ్యాయుల) ప్రధాన కర్తవ్యం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరై పిల్లల అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటూ వారి భవిష్యత్తు కోసం కృషి చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ వేడుకలను విజయవంతంగా ముగించారు.

Post a Comment

0 Comments