రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు 2026వ సంవత్సరం కు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్లు 2025 నవంబరు నుండి 2026 ఫిబ్రవరి వరకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఇవ్వవలసి ఉన్నది. మన భద్రాచలం ఎస్ టి ఓ పరిధిలోని వారు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్లు .ఆన్లైన్ ద్వారా ఇచ్చుటకు గాను మన కార్యాలయంలో ఈ శిబిరాన్ని ప్రారంభించాము .మనం నవంబర్ నుండే ఫిబ్రవరి వరకు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పటికీ ఇంకను లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వవలసిన సమయం గడిచినను ఇవ్వని వారి సంఖ్య అధికంగా ఉండి వారి పెన్షన్లు ఆఖరి నెలలో తీసుకునే పరిస్థితి లేదు. కావున మనం 20 25 నవంబర్ నుండి ఇచ్చినట్లయితే కాలయాపన లేకుండా పెన్షన్లను తీసుకో గలుగుతాము.కావున లైఫ్ సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా చేయించుకునే మన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అందరూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా గల ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో కేంద్రాన్ని పెట్టాము కావున ఈ కేంద్రానికి వచ్చు నప్పుడు ఆధార కార్డు, పి. పి.ఓ. ఐ డి నెంబర్. మన పెన్షన్ బ్యాంకు నుండి పడినట్లుగా మెసేజి వచ్చే మన ఫోను( సెల్ ఫోన్) కేంద్రమునకు వచ్చు నప్పుడు తప్పనిసరిగా తీసుకురావలసిందిగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో కోరారు.ఈ శిబిరం ప్రారంభంలో సంఘం ఉపాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, టి, శివప్రసాద్, మాదిరెడ్డి రామ్మోహనరావు. బి రాజు. దుర్గాప్రసాద్ నాళం సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.
ఎస్. టి.ఓ. శ్రీమతి సుభద్ర కు ఘన సన్మానం.
కేంద్రం ప్రారంభానికి ముందు ఎస్. టి. ఓ.శ్రీమతి సుభద్ర కు. విశ్రాంత ఉద్యోగులు. విశ్రాంత ఉద్యోగ మహిళలు శ్రీమతి ఆర్ హేమలత, ఈ. మణి. అన్నపూర్ణాదేవి. అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు కె ఎస్ ఎల్ వి ప్రసాద్.డి కృష్ణమూర్తి. ఎస్ రాజబాబు. టి శివప్రసాద్ డి తిరుమలరావు. యాటకాని సత్యనారాయణ. మాదిరెడ్డి రామ్మోహనరావు.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
-


0 Comments