- విధులలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదు.
- గిరిజనుల అభివృద్ధికి, అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
భద్రాచలం పట్టణంలోని జిసిసి కార్యాలయం, జిసిసి స్టాక్ నిల్వచేసే గోడౌన్ లను తెలంగాణ రాష్ట్ర జిసిసి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జిసిసి కార్యాలయం అనేది పక్షపాతం లేకుండా పని చేయాలని ఎటువంటి అవకతవకలు, జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి గిరిజన సహకార సంస్థకు ఎంత స్టాక్ వచ్చింది, అది ఎంత సప్లై చేశారనే విషయంలో అధికారులు స్పష్టంగా ఉండాలని, రికార్డులన్నీ కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేయాలన్నారు.
జిసిసి కార్యాలయంలోని ఆయన రికార్డులను పరిశీలించారు. భద్రాచలం జిసిసి ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్ బంకుల నుంచి వచ్చే ఆదాయం కానీ, జిసిసికి వచ్చిన ఆదాయ, వ్యయాలలో అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజన సహకార సంస్థను బ్రష్టు పట్టించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గిరిజన సహకార సంస్థకు ఏది అవసరమైన చేస్తున్నారని, జిసిసి లో పనిచేసే ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు అందిస్తున్నామని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
జిసిసి లో పనిచేసే ప్రతి ఒక్క అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పనిచేయాలని గిరిజన ప్రజల అభ్యున్నత కోసం ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేసే సరుకుల విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో సక్రమంగా అర్హులకు అందే విధంగా కృషి చేయాలన్నారు. పనిలో అలసత్వం వహిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు...
0 Comments