Breaking News

Loading..

భద్రాచలం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా క్రీడల దినోత్సవం




భద్రాచలం పట్టణం లో గల శ్రీ చైతన్య పాటశాలలో, శ్రీ చైతన్య విద్యా సంస్థల జిల్లా స్థాయీ క్రీడల శనివారం ఘనంగా జరిగిన ఈ కారక్రమానికి విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ముఖ్య అతిధులుగా భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి టి. రమా గారు మరియు తెలంగాణ శ్రీ చైతన్య పాటశాల ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్ బి జయరాజ్ గారు కొత్తగూడెం జోన్ A.G.M జయప్రకాష్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఆటలను ప్రారంభించారు.



 ఈ క్రీడలో కొత్తగూడెం జోన్ 6 శాఖల నుండి సుమారుగా 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యా శాఖ అధికారి టి రమా గారు మాట్లాడుతు క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటూ నిజ జీవితంలో ఎదురయే అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తాయి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సర్వతో ముకాభివృద్ధి సాధిస్తారు అని అన్నారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోబాల్, చెస్, క్యారమ్స్, 100 మీటర్ల రన్సింగ్ పోటీలు  జరిగాయి.సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఈ క్రీడలను ఉద్దేశించి నేటి యాంత్రిక జీవితంలో విద్యార్థులు చదువులకి పరిమితం అవుతున్నారని క్రీడలు వారికి ఎంతో మానసిక ఉత్సాహంను అందిస్తాయి అన్నారు క్రీడలలో గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేసారు అదేవిధంగా క్రీడలు విద్యార్థుల మధ్యన ఐక్యతకు దోహ దపడతాయని వ్యాక్యానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జోనల్ కోఆర్డినేటర్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిన ఉపాధ్యాయులు, పి.ఇ.టి లు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్ధిని విద్యార్ధులు పల్గొన్నారు.

Post a Comment

0 Comments