Breaking News

Loading..

నిరుపేద సొంతింటి కల పై గుదిబండగా 'ఇటుక' ఇసుక !

  • ఇందిరమ్మ ఇళ్లకు సిండికెట్ షాక్ - లక్షకు పెరిగిన భారం.
  • ఉచిత ఇసుక ఊసే లేదు..
  • ధరలనియంత్రణలోఅధికారులువిఫలం..
  • పక్కదోవ పడుతున్న ప్రతిష్టాత్మక పథకం.
  • ..సామాజిక ఉద్యమకారులు అలవాల రాజా పెరియార్ ఆవేదన.
అలవాల రాజా పెరియార్


బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 15 భద్రాచలం

సొంతిల్లు కల నెరవేరుతుందని ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇల్లు' పథకం జిల్లా పేదలకు పెనుభారంగా మారింది. గత ఆరు నెలల్లో ఇటుక ధరలు ఆకాశన్నంటడంతో, పేద కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో ఇల్లు కట్టుకోలేక లబోదిబోమంటున్నారు ఇటుక బట్టీల తయారీదారులు ఒకే సిండికేట్‌గా ఏర్పడి, కృత్రిమ కొరతను సృష్టించి ధరలను అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్నారు.సిండికేట్ కారణంగా జిల్లా మొత్తం ఒకే ధరకు ఇటుక అమ్ముడవుతోంది. ధరలకు గానీ, అక్రమ తయారీదారులపై నియంత్రణకు గానీ స్థానిక మైనింగ్, ఆ శాఖల నుంచి పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి.పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ అసాధారణ ధరల పెంపుతో నీరుగారిపోతోంది. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ధరల నియంత్రణ కమిటీ: ప్రభుత్వం వెంటనే జిల్లా స్థాయిలో ఒక ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి, ఇటుక ధరలను పాత రేటుకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలనిప్రత్యేక రాయితీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇటుకలను ప్రభుత్వమే సరఫరా చేసి, రాయితీపై అందించే విధంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకటించాలి.సిండికెట్‌పై ఉక్కుపాదం: అక్రమంగా సిండికెట్‌గా ఏర్పడి ధరలను పెంచుతున్న తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఇటుక బట్టీల సిండికేట్ కారణంగా ధరలు పెరిగి, పేదలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొంటే, ప్రభుత్వ లక్ష్యం వెనుకబడిపోతుంది. పేదల ఆశలను నిలబెట్టేందుకు, జిల్లా ఉత్పత్తి, ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్కువ ధరకు ఇటుకలు లభించేలా చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమ కారులు అలవాల రాజా పెరియర్ అధికారులను విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments