Breaking News

Loading..

స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు కొనసాగించాలి - సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జే. రమేష్..

 

 సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జే. రమేష్.

బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 15 భద్రాచలం


భద్రాచలం పార్టీ మాస్ లైన్ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు. వై.వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన పార్టీ పట్టణ కమిటీ, శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భద్రాచలం పట్టణంలోని నివాస ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు మాస్ లైన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నిర్వహించిన పాదయాత్ర,సమస్యలపై అధ్యయన యాత్ర ల సందర్భంగా పార్టీ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని ఆయన అన్నారు. 

భద్రాచలం పట్టణంలోని అన్ని వార్డులలో స్థానిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుర్తించిన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ప్రజలను సమీకరించి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, ఎన్ నాగరాజు, జీవనజ్యోతి, సిహెచ్ మాధవరావు, కోరాడ శ్రీనివాసరావు, కనక శ్రీ, సండ్ర భూపేంద్ర, ఎస్ డి ఫిరోజ్, చాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments