Breaking News

Loading..

భాగ్యలక్ష్మి లాడ్జీ ని సీజ్ చేయాలి : కుటుంబ సభ్యులు డిమాండ్


లాడ్జి ముందు బైఠాయించిన కుటుంబ సభ్యులు

ఏలూరు జిల్లా కి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసి తమ కూతురిని భద్రాచలం తీసుకొచ్చాడని,వారి మధ్య ఎం జరిగిందో తెలియదు గాని లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని కన్నీటి పర్యంతం అయ్యారు. మైనర్ బాలిక అని తెలిసి కూడా గది అద్దెకిచ్చి, వీరి చావుకు కారణమైన లాడ్జి నిర్వాకులపై ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తు లాడ్జ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయకపోతే ఇక్కడే తాముకూడా ఆత్మహత్య చేసుకుంటామని తమ బిడ్డే లేనప్పుడు ఎటువంటి న్యాయం జరిగినప్పుడు మేము మాత్రం ఎందుకు అని పెట్రోల్ బాటిల్ తో మృతురాలి తల్లితండ్రి ఆందోళన చేశారు.

భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మి లాడ్జ్ లో ఇటీవల ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. అశ్వాపురం మండలానికి చెంధిన16 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులు,  బంధువులు, ఎం ఆర్ పి ఎస్ అధ్వర్యం లో  లాడ్జి ఎధుట అంధోలన చేపట్టారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బంధువులను వారించె ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవటంతో ఆంధోలనకారులను పోలీస్ స్టేషన్ కి తరలించారు..ఈ సందర్బంగా ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మాట్లాడుతు..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి,అక్రమ సంపాధనే  ధ్యేయంగా ప్రేమ జంటలకు,వివేహేతర సంబంధాలు పెట్టుకున్న జంటలకు గదులు అద్దెలకిస్తు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామయ్య కీర్తి ప్రతిష్టలని దెబ్బతీశేలా వ్యవహారిస్తున్న భాగ్యలక్ష్మి లాడ్జీ పై చట్టపరమైన చర్యలు తీసుకుని,భద్రాచలం లో నిబంధనలు పాటించని లాడ్జీల పై ప్రత్యేక దృష్టి పెట్టి అసాంఘిక కార్యకలాపానికి అడ్డుకట్ట వేయాలని  అధికారులను కోరారు..ఐతే మృతురాలి బంధువుల పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు టౌన్ సి ఐ నాగరాజు వెల్లడించారు.

Post a Comment

0 Comments