Breaking News

Loading..

ఏఆర్జిహెచ్ఎం కళాశాలలో 'డా కేర్' క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్.


రాజమండ్రి, సెప్టెంబర్ 13, బిసిఎం10 న్యూస్.

డా అల్లు రామలింగయ్య గివేర్న్మెంట్ హోమియోపతి మెడికల్ కళాశాలలో శనివారం 'డా కేర్ హోమియోపతి' ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా కె వి వి ఎస్ సత్య కుమార్ పాల్గొని ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డా కేర్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తునందుకు డా కేర్ సిఎండి డా ఏ ఎం రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి డ్రైవ్ లు నిర్వహిస్తూ హోమియోపతి డాక్టర్లుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ డ్రైవ్ కి కళాశాల విద్యార్థులు 100 మందికి పైగా హాజరయ్యారు. డా కేర్ ప్రతినిధులు డా సాగర్, జిఎం రమేష్, సిఎస్ఓ శ్రీనివాస్, ఏజిఎం రాంప్రవీన్, కిషోర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి, వారి సంస్థ నిర్వహణ విభాగాలలో పాత్రల కోసం 10 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేశారు. వారి అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత, ఎంపికైన అభ్యర్థులకు మంచి ప్రారంభ వార్షిక వేతన ప్యాకేజీని అందించనున్నట్లు వారు ప్రకటించారు.

Post a Comment

0 Comments