Breaking News

Loading..

సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులు : గడ్డం స్వామి

  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు.
  • చరిత్రను వక్రీకరిస్తే మారిపోదు.
  • తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బిజెపి.
  • సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి.


బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 12 భద్రాచలం

 భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వం అని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. 20వ వార్డు సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో రాజుపేట లో డి.కనక శ్రీ అధ్యక్షతన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ గడ్డ పై నైజాం నవాబు అతని తొత్తులుగా ఉన్న జమీందారులు జాకీర్దారులు, పటేల్ పట్వారిలు దోపిడీకి వ్యతిరేకంగా బాంచన్ దొర  నీ కాళ్లు మొక్కుతా అన్న ప్రజల చేత బంధుకు పట్టించి దొరల గడులను కూల్చిన కమ్యూనిస్టుల చరిత్ర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అని అన్నారు. నేడు దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకు లు చరిత్రను వక్రీకరిస్తూ నాడు దొరల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును  హిందువులు ముస్లింలు మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తూ వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నవాబు చెంచా గిరికి దొరల దోపిడీకి వ్యతిరేకంగా పేదలు కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసిన పోరాటం రక్తాక్షరాలతో లిఖించబడిందని అది చెరిపితే చెరిగేది కాదని అన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పదివేల గ్రామాలు దోపిడీ నుండి విముక్తి గావించబడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని అన్నారు. ఎర్ర జెండా నాయకత్వంలో నాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే నైజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. తెలంగాణ గడ్డపై పేదలు ప్రజలు స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది ఎర్ర జెండా పోరాట ఫలితమేనని అన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. నాటి అమరవీరుల స్ఫూర్తితో మతోన్మాదులకు, కార్పొరేట్ దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, సీనియర్ నాయకులు ముండ్రు ఝాన్సీ,బేగం, శాఖ కార్యదర్శిలు కాకా రమణ, జీ. నాగలక్ష్మి సభ్యులు దేవి, రాధా, రుక్మిణి, సింగు కోటేశ్వరరావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments