![]() |
| అవార్డు అందుకున్న భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి. పాటిల్. |
బిసియం10 న్యూస్ జూలై 17 కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, IAS ఈ రోజు IIT బాంబేలో నిర్వహించిన ‘ఓపెన్ సోర్స్ GIS డే’లో ‘నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ మరియు *ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్ అవార్డు’* లను అందుకున్నారు. ఈ అవార్డులను ISRO మాజీ చైర్మన్ శ్రీ ఏ.ఎస్. కిరణ్ కుమార్ ప్రదానం చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని, జియోస్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో కలిసి భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి ‘ఓపెన్ సోర్స్ GIS సదస్సు’ నిర్వహణకు గాను, అలాగే జిల్లాలోని వివిధ సమస్యలకు సంబంధించి ఓపెన్ సోర్స్ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా జిల్లా విద్యార్థులు, అధికారులు భాగస్వాములుగా పాల్గొని, మన జిల్లా సమస్యలను లోకల్ స్థాయిలో పరిష్కరించే విధంగా కృషి చేసినందుకు ఈ రెండు అవార్డులు లభించాయి.జిల్లా స్థాయిలో GIS ఆధారిత వ్యవస్థలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి, గ్రామీణ సమస్యల పరిష్కారంలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినందుకు ఈ గుర్తింపు లభించింది. గోదావరి వరదల సమయంలో ఫ్లడ్ ప్రిడిక్షన్, గ్రామీణ స్థాయిలో GIS స్కిల్లింగ్, విభిన్న శాఖల డేటాను భౌగోళిక సమాచారంతో అనుసంధానం చేసి నిర్ణయాలు తీసుకునే విధానాలను జిల్లా యంత్రాంగం ముందుండి అమలు చేసింది. భారతదేశంలో మొట్టమొదటి "ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్" ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసి, IIT Bombay FOSSEE GIS సహకారంతో QGIS వినియోగాన్ని గ్రామీణ సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్‌గా నేర్పడంలో జిల్లా నేతృత్వం వహించింది. గోదావరి వరదల ముందు ముంపు గ్రామాల గుర్తింపు, PHC పరిధిలో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ, పత్తి రైతులను మునగ సాగు వైపు మారుస్తూ రైతులను స్వయం సమృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు జిల్లాలో కొనసాగుతున్నాయి.ఈ సందర్భంలో కలెక్టర్ మాట్లాడుతూభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భౌగోళికంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా, 37% గిరిజన జనాభాతో విస్తరించిన జిల్లా. గిరిజనుల విలువైన సంస్కృతి కలిసికట్టుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపిస్తోంది. GIS సాయంతో పత్తి, మొక్కజొన్న పొలాలను మ్యాప్ చేసి, రైతులను మునగ సాగు వైపు మళ్లించే ప్రయత్నం మొదలుపెట్టాము. ఇది రైతులను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి దోహదపడుతోంది. అలాగే, మేకల పెంపకం, మేకపాల ఉత్పత్తి పెంపుదలపై GIS ఆధారంగా పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా IIT Bombay సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాకు తీసుకువచ్చి, రైతులు, విద్యార్థులు, అధికారులు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాము. విద్యార్థులు IIT Bombay సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం, పట్టణాభివృద్ధి, కమ్యూనికేషన్ విస్తరణలో దృష్టి పెట్టి ఉత్పాదకతను పెంచి జిల్లాకు ఆర్థిక వృద్ధిని తీసుకురాగలరని నమ్మకం ఉంది. ఈ సందర్భంలో IIT Bombay నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ సంస్థలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆహ్వానిస్తున్నాను. అన్ని విభాగాలను అనుసంధానించి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను.ఈ రెండు అవార్డులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరికీ గర్వకారణమని, GIS ఆధారిత కార్యక్రమంలో కృషి చేసిన HPHF బృందానికి, Aspirational Block Fellow నవనీతకు జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, IAS అభినందనలు తెలిపారు.జిల్లా అభివృద్ధి దిశగా GIS ఆధారిత వ్యవస్థలను మరింత సమర్థవంతంగా విస్తరించేందుకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటుంది*” అని పేర్కొన్నారు.FOSSEE (GIS), IIT Bombay, విద్యాశాఖ, భారత ప్రభుత్వం (NMEICT) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ 2025 (ఎడిషన్ 02)’ లో ఈ రెండు అవార్డులు లభించాయి. ఇవి ‘నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022’ మరియు ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ కు అనుగుణంగా జియోస్పేషియల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి గుర్తింపుగా నిలుస్తాయి

0 Comments