![]() |
ముగిసిన కళాశాల విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలు. |
బిసిఎం న్యూస్ జూలై 17 బూర్గంపహాడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో గురువారం కళాశాల కౌన్సిల్ ఎన్నికలు ప్రిన్సిపాల్ యం. దేవదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఎన్నికల తేదీని 15.7.2025 న ప్రకటించబడిందని,నామినేషన్లను 16.7.2025 వరకు స్వీకరించబడ్డాయని,ఎన్నికలలో నిలబడే కళాశాల విద్యార్థి అభ్యర్థులు 16.7.2025 తేదీ వరకు తమ ప్రచారాలు నిర్వహించారన్నారు.
స్క్రూటినీ, అర్హత, అర్హులైన అభ్యర్థుల జాబితాను 16.7.2025 తేదీన పోటీలలో పాల్గొన్న అర్హులైన వ్యక్తులు జాబితాను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
17.7.2025 తేదీన మొబైల్ ఈ వి యం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని, మొత్తం 140 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.
ఎన్నికైన అభ్యర్థుల వివరాలను ఆయన ప్రకటించారు.
1. కళాశాల విద్యార్థి నాయకుడిగా (సి పి ఎల్) పేనక రామ్ చరణ్, (సి ఇ సి, రెండవ సంవత్సరం)
2. డిప్యూటి సి పి ఎల్ గా ఎస్. సాయి కార్తీక్ (బైపీసీ మొదటి సంవత్సరం)
3. ఫుడ్ లీడర్ గా ఈసం అభినయ్ (సీఈసీ రెండవ సంవత్సరం)
4. సెకండ్ లీడర్ గా కె. తరుణ్ (సిఇసి మొదటి సంవత్సరం)
5. కల్చర్ లీడర్ గా కె. శశాంక్ (బైపీసీ రెండవ సంవత్సరం)
6. స్పోర్ట్స్ లీడర్ గా బొర్ర శ్యామ్ ప్రసాద్ (బైపీసీ రెండవ సంవత్సరం)
7. సెకండ్ స్పోర్ట్స్ లీడర్ గా పి. వరుణ్ తేజ (హెచ్ ఈ సి రెండవ సంవత్సరం)
8. లిటరరీ లీడర్ గా ఎస్ సోమశేఖర్ (బైపిసి రెండవ సంవత్సరం)
9. క్లీన్ & గ్రీన్ లీడర్ (పరిసరాల పరిశుభ్రత) వర్ష జంపన్న (సిఇసి రెండవ సంవత్సరం) గా కళాశాల కౌన్సిల్ విద్యార్థుల ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. ఎంపికైన అభ్యర్థులు తాము పోటీ చేసి గెలుపొందిన పదవులకు న్యాయం చేయాలని, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల పట్ల సోదర భావం కలిగి ఉండాలని, తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండటమే కాకుండా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల్లో గెలుపొందిన కళాశాల కౌన్సిల్ నాయకులు తమ పదవులను అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా నిర్వర్తించి బాగా చదువుకుంటూ, ఆటలలో ప్రావీణ్యం సంపాదించాలని, మంచి భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ కళాశాలలో పరిశుభ్రత పాటిస్తూ తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, చదువులు చెప్పే గురువుల వద్ద గౌరవంగా మెసులుకొని బాగా చదువుకొని కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలన్నారు. ఎన్నికల నిర్వహణ, ఓటు హక్కు తదనంతర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments