Breaking News

Loading..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా.. మెమోరాండం సమర్పణ. .



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వవిశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమస్యలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ, ప్లకార్డులు పట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు. గౌరవ అధ్యక్షులు ఎంవీఎస్  నారాయణ, భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి ధర్నా నిర్వహించారు. 

ఈ ధర్నాలో 1)పెండింగ్ లో ఉన్న ఐదు డి ఆర్ లను వెంటనే ప్రకటించాలని,2 పి ఆర్ సి ఇవ్వాలని, 3. రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, 4. రాష్ట్ర ప్రభుత్వం 398 రూపాయలకు పని చేసిన ఉపాధ్యాయులకు పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలని పెన్షన్ కు కలపాలని. 5. సీనియర్ సిటిజనులకు బస్సు/రైలు/విమానాలలో రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. 

ఈ ప్రదర్శనలో జిల్లా అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఎంవీఎస్  ఎస్ నారాయణ. 

భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, పెన్షనర్స్ మహిళా నాయకులు శ్రీమతి డి గ్రేస్ మేరీ, శ్రీమతి కే వరలక్ష్మి, ఏసు పాదం.  భద్రాచలం డివిజన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి, నాళం సత్యనారాయణ ,సుబ్బయ్య చౌదరి, జివి రమణ, రమణారావు, మాదిరెడ్డి రామ్మోహనరావు, రాజబాబు, బంధు నరసింహారావు, పంపన సత్యనారాయణ ,విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం,  బైరు నరసింహారావు, మురళీకృష్ణ, అక్కయ్య, బి రాజు, కొండలరావు, చింతా రాధాకృష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ గారికి మెమోరాండం అందజేత 

తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన మరియు ధర్నా నిర్వహించి కలెక్టర్ వారికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలతో కూడిన మెమోరాండం సమర్పించి సమస్యలు పరిష్కరించాలని ఈ మెమోరాండమును కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసినదిగా  అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ గారిని కోరారు.జిల్లా అధ్యక్షుడు చల్లగుళ్ళ నాగేశ్వరరావు. భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న పెన్షనర్స్.








Post a Comment

0 Comments