- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.
- భద్రాచలం జూనియర్ కళాశాల లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
- ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేయాలి.
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్.
భద్రాచలం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులను నుండి అయన సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం లేకపోవడంతో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.భద్రాచలం ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల లో సెమినార్ హాల్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సెమినార్ హాల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కాళాశాల లో టాయిలెట్లు పరిశుభ్రత లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.బాయ్స్ విద్యార్థులకు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.బాయ్స్ టాయిలెట్సును వెంటనే నిర్మించాలని అన్నారు.కళాశాల చుట్టు పక్కల దోమల నివారణ మందు పిచికారి చేయించాలని అన్నారు. కళాశాల చుట్టు పక్కల పారిశుధ్యం పనులు వెంటనే నిర్వించాలన్నారు.జూనియర్ కళాశాలలో వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహించి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు తగ్గట్టుగా తరగతి గదుల్లో బల్లలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేసి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు దూరం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.భద్రాచలం జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సౌజన్య,పవన్, కళ్యాణ్,గీత,అముల్యా,అనిత, స్వరూప, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments