Breaking News

Loading..

జూలై 23 తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి : ఎస్ఎఫ్ఐ



              బిసిఎం10 న్యూస్ జూలై17 భద్రాచలం

  • పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  • నూతన జాతీయ విద్య విధానాన్ని- 2020 రద్దు చేయాలి.
  • భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ : జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్.


 రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి, ఈ నెల 23 తేదీన జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని, ఈ బందులో అత్యధికంగా విద్యార్థి లోకం పాల్గొనాలని, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ కోరారు. ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు దేవేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీంద్ర మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర కాలం గడుస్తున్న ఇంతవరకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయలేదని దీని కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని యజమాన్యాలు విద్యార్థులను తీవ్రస్థాయిలో గురి చేస్తున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను (బిల్లులను) విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాల కు స్వంత భవనాలు లేక అద్దె భవనాల్లో పాఠశాల నడిపించడం వలన విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల పాఠశాల కు స్వంత భవనాలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.దూర ప్రాంతంల నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్ పాసులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా రంగంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సుప్రియ,తేజ,లాహరి,స్పందన, కీర్తి, కావ్య,మధు, సందీప్,సావూల్, ప్రవీణ్,సాయి వర్మ,అక్షిత్, చరణ్,అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments