![]() |
| ఆర్డీవో కార్యాలయ సూపర్డెంట్ కి వినతి పత్రం అందజేత |
బిసిఎం10 న్యూస్ జూలై 17 భద్రాచలం
చర్ల దుమ్ముగూడెం ఇసుక ర్యాంపుల నుండి అధిక లోడు తీసుకొని అతివేగంగా భద్రాచలం పట్టణంలో పయనిస్తున్న ఇసుక లారీలను నియంత్రించాలని డివైఎఫ్ఐ భద్రాచలం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఆది సతీష్ బాబు లో డిమాండ్ చేశారు. గురువారం డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వేగంగా పయనిస్తున్న ఇసుక లారీలను నియంత్రించి ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయ సూపర్డెంట్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సతీష్ బాబు ఆది లు మాట్లాడుతూ అధికలోడులతో అతివేగంగా సమయం సందర్భం లేకుండా పాఠశాలల జోన్ల మీదుగా లారీలు ప్రయాణించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బుధవారం ఇసుక లారీ అతివేగంగా పట్టణంలోని నన్నపనేని మోహన హైస్కూల్ సమీపంలో ట్రాన్స్ఫర్ అని ఢీకొనగా మూడు స్తంభాలు కూలిపోయాయి అని అర్ధరాత్రి ఆ సంఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అదే ఉదయం పనివేళలో జరుగుతే తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు. ఇసుక లారీలను నియంత్రించేందుకు పోలీస్ ఆర్టీవో శాఖలను సమన్వయం చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు పట్టణంలో ఇసుక లారీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా వందల కొద్ది లారీలు అధిక లోడులతో ప్రయాణించడం వల్ల రోడ్డును ధ్వంసం అయిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఇసుక ర్యాంపుల నిర్వాహకులతో కుమ్మక్కవటంతోనే ఇటువంటి సంఘటనలు కొనసాగుతున్నాయని అధికారులు ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేసే ఇసుక లారీలను నియంత్రించాలని కోరారు. వీలైనంత త్వరగా ఇసుక లారీల నియంత్రణ జరగకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సరిహద్దుల దృక్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాకదాని మురళీకృష్ణ పోసి అజయ్ కుమార్ శ్రీను నాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments