బిసిఎం10 న్యూస్ మే 21 బూర్గంపాడు
నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మనబూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ బ్రోచర్ను పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుల సేవా అనిర్వచనీయమని అహర్నిశలు పనిచేసే జర్నలిస్టులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నేటి సమాజంలో పట్టిపీడిస్తున్న గంజాయి మాదకద్రవ్యాలు వినియోగంపై ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించేది మాత్రం మాత్రం మీడియా నే అని అన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా మీడియా మిత్రులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
0 Comments