ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఈరోజు ది 21.06.2025 న భద్రాచలం నకు సమీపములో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకట రెడ్డి పేట గ్రామములో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అర్చకులతో ఆశీర్వచనములు తీసుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించటం జరిగింది.
ఈ స్వామి ఆలయము లోనే ఉన్న శివాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించి అచ్చటి అర్చకుడి చే ఆశీర్వచనం. గోత్రనామాలు తో పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం స్వామివారి అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదమును స్వీకరించటం జరిగింది.
ముఖ్యంగా ఈ దేవాలయం వెంకటరెడ్డి పేట లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం మన సంఘం బాధ్యులు పెద్దలు అయిన మాదిరెడ్డి రామ్మోహనరావు గారి ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయం దాదాపుగా 90 సంవత్సరాలు పైగా ఉన్న దేవాలయం, ఈ ఆలయం లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి దర్శనీయమైనటువంటి దేవాలయం ఈ వెంకట్ రెడ్డి పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం .తప్పక చూడదగినటువంటి ప్రదేశం ఈ దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలమునకు సమీపములోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అందరూ వెళ్లి దర్శించుకునేటువంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం.
ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కే ఎస్ ఎల్ వి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి దంపతులు. ఉపాధ్యక్షులు సిహెచ్ సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, జి మురళీకృష్ణ. సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పంపన సత్యనారాయణ దంపతులు మరియు ఆల్ పెన్షనర్స్ నాయకులు దుర్గాప్రసాద్, అక్కయ్య, బంధు నరసింహారావు, సూరిశెట్టి కృష్ణయ్య, చింతా రాధాకృష్ణ, చలవాది శ్రీనివాసరావు ,ఐ .వి. వి. సత్యనారాయణ, ఎన్వి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.




0 Comments