Breaking News

Loading..

భద్రాచలం సబ్ ట్రెజరీ కార్యాలయమునకు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ వారిచే కుర్చీలు వితరణ ..


              భద్రాచలం మే 17  బిసిఎం10 న్యూస్

భద్రాచలం ఎస్ టి ఓ పరిధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఈ కార్యాలయము నుండే, చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, కూనవరం, చింతూరు, వి ఆర్ పురం. తదితర మండలాలలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు మంజూరి చేస్తారు. ఆ క్రమంలో అనేకమంది పెన్షనర్లు కార్యాలయమునకు వచ్చిన సందర్భంలో కూర్చునుటకు కుర్చీలు తగినంతగా లేనందున వారు కూర్చునుటకు మరియు వివిధ సంఘాల నాయకులు ప్రాతినిధ్యము చేయు సందర్భంలో కుర్చీలు లేనందున గమనించి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన కమిటీ నుండి పది (10) కుర్చీలను ఈరోజు సబ్ ట్రెజరీ ఏటీవో విష్ణు రావు . ఎస్ టి ఓ శ్రీమతి టి. సుభద్ర. సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి ఉషారాణి, క్రాంతి కుమార్. కొండారెడ్డి. గార్లకు అందజేయమైనది. ఈ కార్యక్రమం ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు డి శివప్రసాద్ ఎస్ రాజబాబు. మాదిరెడ్డి రామ్మోహనరావు. సీత్య నాయక్. సూరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొని కుర్చీలు అందజేశారు. 






Post a Comment

0 Comments