Breaking News

Loading..

కరకట్ట నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : సిపిఎం


 

  • కరకట్ట నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.
  • గోదావరి ముంపు నుండి భద్రాచలాన్ని రక్షించాలి.
  • చిత్తశుద్ధి లేని జిల్లా మంత్రుల హామీలు .
  • పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి జరిగే నష్టానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
  • పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పై 'రీ సర్వే' చేయించాలి.
  • నత్త నడకన నడుస్తున్న కరకట్ట నిర్మాణం పనులు.
  • కరకట్ట నిర్మాణం పనులను పరిశీలించిన సిపిఎం జిల్లా బృందం.

  • కరకట్ట నిర్మాణం పనులపై ఇరిగేషన్ ఈ ఈ తో మాట్లాడిన సిపిఎం బృందం.
  • హై లెవెల్ రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి ఎస్టిమేషన్స్ పంపాము
  • పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సర్వే పై జాయింట్ సర్వేకు అప్పిలు చేశాము.
  • సిపిఎం బృందంతో ఇరిగేషన్ ఈఈ వెల్లడి.

 భద్రాచలం పట్టణం గోదావరి ముంపుకు గురి కాకుండా 38 కోట్లతో సుభాష్ నగర్ కాలనీ వైపు నిర్మిస్తున్న కరకట్టను త్వరితగతిన పూర్తి చేయాలని, గోదావరి ముంపు నుండి భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ లు అన్నారు.


 నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను సిపిఎం బృందం నేడు పరిశీలించింది. అనంతరం ఇరిగేషన్ అధికారులను కలిసి కరకట్ట పనులకు సంబంధించిన అంశాలను చర్చించడం జరిగింది.టిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన కరకట్టను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ కరకట్ట పనులు పూర్తి కాలేదని నత్తనడకన పనులు సాగుతున్నాయని వారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు జిల్లాలోని ముగ్గురు మంత్రులు కరకట్టను త్వరితగతిన పూర్తి చేస్తామని భద్రాచలం ముంపు నుండి రక్షిస్తామని హామీలు గుప్పించి ఆ మాటే మరిచారని అన్నారు. ప్రారంభంలో హడావుడి చేసిన మంత్రులకు కరకట్ట నిర్మాణం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. వర్షాకాలం వచ్చే లోపు కరకట్ట పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికిన మంత్రులు కరకట్ట ఇంకా ఎందుకు పూర్తి కాలేదొ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భద్రాచలం ఎంపీ,ఎమ్మెల్యేలకు ఈ సమస్య పట్టదని విమర్శించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి జరిగే నష్టానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. నిత్యం రామజపం చేసే బిజెపి వారికి భద్రాచలం రాముడు మునుగుతున్న పట్టదా అని ప్రశ్నించారు.పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పై రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు.. గతంలో నిర్మించిన పాత కరకట్టను ఎత్తు పెంచి, పొడిగించి పటిష్టంగా నిర్మించేందుకు కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలని అన్నారు. గోదావరి ఫ్లడ్ మాన్యువల్ ను మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కరకట్టను పూర్తి చేసి పాత కరకట్టకు నిధులు మంజూరు చేయాలని లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో దశల వారి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 *ఇరిగేషన్ అధికారులతో సిపిఎం బృందం భేటీ*

 కరకట్ట పనులు పరిశీలన అనంతరం ఇరిగేషన్ ఈ ఈ,డి ఈ జేఏలతో సిపిఎం బృందం భేటీ అయింది. కరకట్ట పనులు ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఈ మహమ్మద్ జానీ మాట్లాడుతూ కరకట్ట నిర్మాణంలో అంతర్భాగమైన హై లెవెల్ రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి ఎస్టిమేషన్స్ నేషనల్ హైవే అధికారులకు పంపడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసి సుభాష్ నగర్ కాలనీ లోకి వరద రాకుండా తగు చర్యలు చేపడతామని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పై ఆంధ్ర,తెలంగాణ అధికారులతో జాయింట్ సర్వేకు అప్పిలు చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ ఐఐటి ఇంజనీరింగ్ నిపుణులతో సర్వే చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ సర్వే బృందంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్ అజయ్ కుమార్ ధనకొండ రాఘవయ్య కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments