Breaking News

Loading..

ఉత్తమ డాక్టర్ అవార్డు పొందిన డాక్టర్ తెల్లం వెంకటరావుకు ఘన సన్మానం

బిసిఎం10 న్యూస్ భద్రాచలం 16.06.25 : ప్రముఖ వైద్యుడు భద్రాచలం శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావుకు సుమన్ టీవీ వారు నిర్వహించిన సర్వేలో ఉత్తమ డాక్టర్ గా ఎంపిక అవార్డు పొందినందుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు 


ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ ప్రముఖులు పాల్గొన్నారు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలు వైద్య వృత్తి అంటే అంత ఆషామాషీ విషయం కాదని ఎన్నో ఔదాలు ఉంటాయని తెలిపారు అయినప్పటికీ ఎంతోమంది ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారని వైద్యుడు వంటి కనబడే దేవుడు అని అన్నారు 


తాను వైద్య వృత్తి ఎంచుకున్నప్పటినుండి సాధ్యమైనంత వరకు సేవా దృక్పథంతోనే పనిచేశానని వైద్యుడు అనేవాడు సేవా దృక్పథంతో పనిచేయాలని డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకోకూడదని తెలిపారు. తనకు ఎవడు రావడం ఎంతో ఆనందంగా ఉందని వైద్య వృత్తిలోనే కాకుండా ప్రజాప్రతినిగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రజలకు సంక్షేమం అందించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే భద్రాచలంలో పాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అందులో భాగంగా రామాలయం చుట్టుపక్కల అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు పేదవారికి సన్న బియ్యం ఉచిత విద్యుత్ 500 కే గ్యాస్ సిలిండర్ లాంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

Post a Comment

0 Comments