Breaking News

Loading..

పోలవరం పాపం బిజెపిదే : బండారు రవికుమార్..

 
              బిసిఎం10 న్యూస్ మే 24 భద్రాచలం

పోలవరం పాపం బిజెపిదే అని బిజెపి ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధిని భూస్థాపితం చేసిందని పోలవరం క్ వాటర్ సమస్యకు పరిష్కారం చూపాలి డిమాండ్ చేసిన సిబిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండ రవికుమార్ ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీలతోనే భద్రాచలం అభివృద్ధి ముడిపడి ఉందని బిజెపి పాలన లో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది తెలిపిన సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్.


ఉత్సాహంగా రెండో రోజు కొనసాగిన సిపిఐఎం రాజకీయ శిక్షణ తరగతులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్టణ శ్రేణులు

ఓట్ల కోసం అనునిత్యం రామ నామ జపం చేసే బిజెపి పోలవరం నిర్మాణానికి నిధులను విడుదల చేస్తూ శ్రీరాముని గుడిని భద్రాచలం పట్టణాన్ని గోదావరిలో ముంచే  పాపానికి ఒడిగడుతుందని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ఆరోపించారు. మంగళవారం సిపిఐ ఎం భద్రాచలం పట్టణ స్థాయి రాజకీయ రెండవ రోజు శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి నాయకత్వంలో ఎన్ డి ఏ మూడోసారి అధికారం చేపట్టాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలపై సిఐడి, ఈడి తదితర సంస్థలను ప్రయోగించి బెదిరిస్తుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సలైట్లు పేరుతో జైలకు తరలిస్తున్నారని అన్నారు. అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు మధ్య ఘర్షణలను పెంచుతూ అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి భద్రాచలం ప్రాంతానికి తీవ్ర నష్టం చేసింది బిజెపి ప్రభుత్వం అని అన్నారు.పోలవరం పూర్తి అయితే బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు తప్పదని ఇంజనీర్ల బృందం స్పష్టం చేసినప్పటికీ నివారణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి ముడిపడి ఉన్న ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపడానికి కూడా ఆసక్తి చూడటం లేదని భద్రాచలం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని అన్నారు. పోలవరం తో భద్రాచలానికి వచ్చే ముంపు పై సీపీఐఎం 2005 నుండి ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని జైలు జీవితాన్ని సైతం పార్టీ కార్యకర్తలు అనుభవించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పోలవరం ముంపు పై అధికారుల నిపుణుల సూచనలను పరిగణంలోకి తీసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రారంభించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీలైనంత త్వరగా చర్చించుకొని ఐదు పంచాయతీల సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. భద్రాచలం పట్టణ సమస్యలపై పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో అధ్యయనం చేసి పరిష్కారానికి దశల వారి పోరాటాలను రూపొందిస్తున్నామని తెలిపారు.రెండో రోజు మధ్యాహ్నం సోషల్ మీడియా ప్రాధాన్యతను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ వివరించారు. రాజకీయ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ గా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి బాధ్యత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట్రామారావు పారిల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, ఎన్ నాగరాజు, జీవనజ్యోతి,కుంజా శ్రీనివాస్,సిహెచ్ మాధవరావు,భూపేంద్ర, ఎస్ అజయ్ కుమార్, ఏ రత్నం, కనక శ్రీ,చాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments