ఆకర్షణీయమైన బ్రోచర్లతో విద్యార్థులను మోసం చేస్తున్న కార్పొరేట్ కాలేజీల పై చర్యలు తీసుకోవా*
*ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేటు కాలేజీలను వెంటనే సీజ్ చేయాలి.*
*ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ డిమాండ్.*
బిసిఎం10 న్యూస్ భద్రాచలం 03.06.25: ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల పేరుతో విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణ కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు... భద్రాచలం పట్టణం లో ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను, వారి తల్లి తండ్రుల ను ఆకర్షణీయమైన బ్రోచర్లతో విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యం పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల పేరుతో యాజమాన్యం నకిలీ బ్రోచర్ల తో ప్రచారం చేస్తుంటే విద్యా శాఖ అధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటోనని ప్రశ్నించారు.ఎటువంటి ప్రభుత్వ అనుమతుల లేని ప్రైవేటు కాలేజీలపై సంభందిత అధికారులు వెంటనే విచారణ జరిపించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం లో ఆదివాసి విద్యార్థులే ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉన్నారని ఆదివాసి విద్యార్థులను కార్పొరేట్ కాలేజీలు యాజమాన్యం బురిడీ కొట్టించి ఆదివాసి విద్యార్థులను అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యం కొంతమంది విద్యార్థుల విలువైన సర్టిఫికెట్లు తమ దగ్గర ఉంచుకుని పెండింగ్ ఫీజులు చేల్లిస్తేనే సర్టిఫికెట్లు విద్యార్థుల చేతికి ఇస్తాం లేకుంటే ఇయ్యాం మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ విద్యార్థులపై కొంత మంది కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు బుకయిస్తు ఆదివాసి విద్యార్థులను బెదిరిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మరలా జారకుండా కాలేజీల యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనుమతులకు బిన్నంగా ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తున్న కాలేజీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనుమతులు ఉన్న కాలేజీలను డీస్ ప్లే పెట్టాలని మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.అనుమతులు లేని కాలేజీలను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయక ఆదివాసి విద్యార్థులను ర్యాంకుల పేరిట బురిడీ కొట్టిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యం పై విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భద్రాచాలం పట్టణంలోని ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల దాందా యదేచ్ఛగా నడిపిస్తుంటే విద్యా శాఖ అధికారులు నోరు మెదపక పోవాటం కారణాలు ఏమిటోనని అధికారులను ప్రశ్నించారు.విద్యా శాఖ అధికారులు తక్షణమే స్పందించి కార్పొరేట్ కాలేజీల పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంపత్ చందర్రావు కిరణ్ అశోక్ పాల్గొన్నారు.

0 Comments