- జే.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరుతో ఐదేళ్ళుగా సేవా కార్యక్రమాలు
- - రక్తదానం, అన్నదానంతో పాటు పలు సేవలు
- శ్రీరామనవమికి భద్రాద్రి వచ్చే భక్తులకు పానకం, మజ్జిగ, పులిహోర పంపిణీ.
బిసీఎం10 న్యూస్ బూర్గంపహాడ్ ఏప్రిల్ 06 : బూర్గంపహాడ్ మండలంలోని సారపాక తాళ్లగొమ్మోరుకు చెందిన జమ్మి షణ్ముఖరావు ఊహ తెలియని వయస్సులో గోదావరి నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. జమ్మి షణ్ముఖరావు జ్ఞాపకార్థం 'జే.ఎస్.ఆర్. ఫౌండేషన్'ను ఏర్పాటు చేసి 5 సంవత్సరాలుగా సోదరుడు సాయిరాంతో పాటు స్నేహితులు బండారి జస్వంత్, వల్లపు రోహిత్, ముత్యాలు జై చరణ్, ప్రవీణ్, భరత్, బొల్లం మహేష్, జమ్మి పవన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయంతో పాటు అవసరమైన వారికి రక్తదానం, పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలకు భక్తులకు ఆహారం, పులిహారో, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ తమ స్నేహితుడిపై ఉన్న మమకారాన్ని చాటుతున్నారు. జమ్మి షణ్ముఖరావు ఆశయ సాధన కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేందుకు మా మిత్ర బృందం ఎళ్ళవేళలా సిద్ధంగా ఉంటుందని మిత్రులు చెప్పడం విశేషం. సుదూర ప్రాంతాల నుండి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు పానకం, మజ్జిగ, మంచినీరు, పులిహోర ప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం ముఖద్వారం సారపాక ఆర్చి దగ్గర ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి భక్తుల కోసం చేస్తున్న మా ఈ ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జెఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, జమ్మి షణ్ముఖరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

0 Comments