Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత పానకం, వడపప్పు, మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయ ముక్కలు అందజేత.


శ్రీరామనవమి సందర్భముగా భద్రాచలం కు లక్షలాదిమంది భక్తులు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణము చూసి తరి oచుటకు దేశం నలుమూలల నుండి భక్తులు భద్రాచలం వచ్చారు. వచ్చిన భక్తులకు భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు శ్రీ సీతారామ చంద్రుని చిత్రపటానికి శ్రీ తుమ్మలపల్లి ధనేశ్వర రావు, చల్లగుల్ల నాగేశ్వరరావు. ఎం వి ఎస్ నారాయణ, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు పూల దండలు వేసి కొబ్బరికాయలు కొట్టి పానకం వడపప్పు చల్లటి మజ్జగ ప్యాకెట్లు, చల్లటి మంచినీరు ప్యాకెట్లు, తియ్యటి పుచ్చకాయ ముక్కలు భక్తులకు ఇచ్చి ప్రారంభించారు. 


 6 క్వింటాలు పుచ్చకాయలు, 3వేల మంచినీటి ప్యాకెట్లు , 2000 మజ్జిగ ప్యాకెట్లు, ఐదు కేజీల వడపప్పు, 50 కేజీల బెల్లంతో పానకం తయారుచేసి భక్తులకు పంచారు. 



ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు కేఎస్ఎల్వీ ప్రసాద్, డి కృష్ణమూర్తి, మాదిరెడ్డి రామ్మోహన్రావు, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, Sరాజబాబు, సుబ్బయ్య చౌదరి శ్రీరామ్ శెట్టి కృష్ణ, విష్ణు మలకల బద్రీనాథ్, శ్రీమతిదారనళిని, శ్రీమతి శిరీష, శ్రీమతి కళావతి, పాల్గొని భక్తులకు పంచారు.




ఈ మొత్తం కార్యక్రమంలో దుర్గాప్రసాద్ డి వెంకటేశ్వర్లు కృష్ణయ్య, ఏఎస్ఐ సింహరావు, కాశయ్య, ఐలయ్య, టీ నాగేశ్వరరావు, వి రాంబాబు, కిషన్ రావు, నారాయణ రావు, కొండలరావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments