● స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
భద్రాచలం, ఏప్రిల్ 06, బిసిఎం10 న్యూస్.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్త జనులతో, రామనామ స్మరణతో మిథిలా స్టేడియం మారుమోగింది.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరుఫున చైర్మన్ బిఆర్ నాయుడు, భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, సీఎస్ శాంతికుమారి దంపతులు హాజరయ్యారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్వి శైలజా రామయ్యార్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.


0 Comments