సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ గా బండారు శరత్ బాబు..
27 మందితో నూతన కమిటీ ఎన్నిక...
సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ గా బండారు శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు స్థానిక చందర్రావు భవనంలో గోపాలకృష్ణ నగర్ లో జరిగిన సిఐటియు 11వ మహాసభలో 27 మందితో నూతన పట్టణ కమిటీని ఎన్నుకోగా కన్వీనర్ గా బండారు శరత్ బాబును ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి యువజన సంఘాలలో సుదీర్ఘకాలం పట్టణ డివిజన్ జిల్లా స్థాయిలలో పనిచేసిన శరత్ బాబు నీ సిఐటియు 11వ మహాసభలో సిఐటి పట్టణ కమిటీ సభ్యులుగా ఎంపీ నర్సారెడ్డి ఎర్రంశెట్టి వెంకట రామారావు పారేల్లి సంతోష్ కుమార్ కొలగాని రమేష్ అంబోజిరత్నం నకిరేకంటి నాగరాజు అజయ్ కుమార్ సండ్ర భూపేంద్ర అప్పారి రాములను కోర్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోగా పట్టణ కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బండారు శరత్ బాబు మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారం చేపట్టిన నాటినుండి ఒక్కొక్కటిగా కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కార్మికుల హక్కుల చట్టాల స్థానంలో కోడ్ లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల ఐక్యం చేసి ఉద్యమిస్తామని అన్నారు. సంఘటిత అసంఘటిత కార్మికులను ఐక్యం చేసి పాలకుల విధానాలను ఎండకుడతామని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలను ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఉద్యమిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేంతవరకు దశల వారి ఉద్యమాలు చేస్తామని అని సందర్భంగా స్పష్టం చేశారు. భద్రాచలంలో ఇసుక ర్యాంపు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే భద్రాచలం కేంద్రంగా ఇసుక ర్యాంపు నీ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు కొలగని బ్రహ్మచారి నాయకులు గడ్డం స్వామి తో పాటు 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు

0 Comments