- ఉగ్రవాదం నశించాలి..మానవత్వం వర్ధిల్లాలి..
- ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ.
- ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న 8 మసీదులకు చెందిన ముస్లిం కమిటీ సభ్యులు.
కాశ్మీరులో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఉగ్రవాదం నశించాలి మానవత్వం వర్ధిల్లాలి అని ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ షఫీ మున్నా అజీమ్ సలీం ఫిరోజ్ తదితర మజీద్ కమిటీ పెద్దలు ఆకాంక్షించారు. శనివారం కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా మృతులకు సంఘీభావ శాంతి ర్యాలీని పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి యువి సెంటర్ మసీద్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం లౌకిక దేశంగా విరధిల్లుతుందని భారతదేశంలోని పౌరులందరూ కులమతాలకు అతీతంగా సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న భారత దేశంలో ఉగ్ర దాడులను సహించేది లేదని అన్నారు. కాశ్మీరు అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యటకులపై విచక్షణారహితంగా దాడులు చేసి హత్య చేసిన ఉగ్రముఖలను కఠినంగా శిక్షించాలని కోరారు. అదే సందర్భంలో పర్యటకులకు కల్పించే భద్రత వైఫల్యాలపై కూడా మరోసారి సమీక్షించి సంధ్యాత్మక ప్రదేశాలలో భద్రత నిఘా పెంచాలని కోరారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఏ ఒక్క మతానికో కులానుకో చెందినది కాదని యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా పరిగణించి ఉగ్రవాదం ఏ మతంలో ఉన్న అంతమొందించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి భారతీయులందరూ మద్దతుగా నిలుస్తారని అందులో ఏ సందేహం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉగ్ర మొక్కలు చేసే విచ్చిన కర్ర చర్యలను మతాల మధ్య చిచ్చులు పెట్టే ఆయుధంగా వాడుకోవద్దని కోరారు. సర్వర్ ఆలీ భాష మస్తాన్ అలీ సుభాని జాకీర్ కరిముల అలీ ఖాన్ అసాద్ సుభాన్ అక్బర్ తదితర మైనార్టీ ముస్లిం పెద్దలు ర్యాలీలో అగ్రభాగాన్ని నిలిచి కొవ్వొత్తులు పట్టి మతసామరస్యం వర్ధిల్లాలి ప్రపంచశాంతి వర్ధిల్లాలి ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేయగా జాతీయ జెండా పట్టి ర్యాలీలో పాల్గొన్న ముస్లిం మహిళలు....!*
ఉగ్ర దాడికి నిరసనగా ముస్లిం మజీద్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ శాంతి ర్యాలీలో పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే కాకుండా జాతీయ జెండాలను చేతపట్టి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి మతసామరస్యం వర్ధిల్లాలి ఉగ్రదాడులను అరికట్టాలి అంటూ నినర్దిస్తూ ప్రదర్శన అగ్రభాగంలో నిలిచి తమ దేశభక్తిని చాటారు. ఉగ్రవాదం ఏ మతంలో ఉన్న ప్రమాదకరమైన అని నియమిస్తూ భారతదేశం లోకి దేశంగా వర్ధిల్లాలని ఉగ్రదాడులను మతాలకు అంటగడుతూ చిచ్చులు పెట్టడం జరిగింది కాదని మొదటిసారిగా ముస్లిం మహిళలు వీధుల్లో కొచ్చి శాంతి ప్రదర్శన నిర్వహించడం పట్టణంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది.

0 Comments