పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను మరియు పిఆర్సి రిపోర్టు తెప్పించుకొని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 29వ తేదీన హైదరాబాదు లోని ఇందిరా పార్క్ ముందు ఆల్ పెన్షనర్స్ ధర్నా జయప్రదం చేయండి.
తెలంగాణఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 29 న హైదరాబాదులోని ఇందిరా పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి గార్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. కనుక మన భద్రాచలం డివిజన్ నుండి వీలైనంత ఎక్కువ మంది పెన్షనర్లు ధర్నాలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి. ఉపాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి. గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు, సంఘ ఉపాధ్యక్షుడు ఎస్ రాజబాబు, కార్యదర్శులు డి శివప్రసాద్, మురళీకృష్ణ, సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పంపన సత్యనారాయణ, నాయకులు విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. ఎస్ ఐలయ్య, సుధాకర్ రెడ్డి, అక్కయ్య, ఒక్క రాంబాబు, వి రాంబాబు, తదితరులు కోరుతున్నారు.
0 Comments