Breaking News

Loading..

'రిథం ఆఫ్ సక్సెస్' - శ్రీవిద్యానికేతన్ లో 11వ వార్షికోత్సవ వేడుకలు.





ఖమ్మం, మార్చి 29, బిసిఎం10 న్యూస్.

స్థానిక కరుణగిరి టిఎన్జివోస్ కాలని శ్రీవిద్యానికేతన్ స్కూల్ లో 'రిథం ఆఫ్ సక్సెస్' అనే కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్ వెంకట సత్యనారాయణ, ప్రధానోపాధ్యురాలు శ్రీలక్ష్మి అధ్యక్షతన 11వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు' అనే భావనతో శ్రీవిద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న వారు పెద్ద కంపెనీలలో, పలు ప్రభుత్వశాఖల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. ప్రస్తుత సమాజంలో కనుమరుగయిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ, విలువలతో కూడిన విద్యను, నైతిక ప్రవర్తను విద్యార్థులకు అందించడంలో తమ విద్యాసంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం ఈ వేడుకలో విద్యార్థిని విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలతో, నాటికలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ షెహన, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments