● ఈ బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలం - కష్టజీవులకు వ్యతిరేకం.
హైదరాబాద్, ఫిబ్రవరి 02, బిసిఎం10 న్యూస్.
పార్లమెంట్‌లో నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదరికాన్ని కాదు, పేదల్ని నిర్మూలించేలా ఉంది. ఈ బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉందని ప్రజల అభిప్రాయం. అంబానీ, అదానీ తయారు చేసిన బడ్జెట్‌ను ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఆర్థిక మంత్రి చదివినట్టు ఉంది. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పై సిఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అని ప్రాంతాల్లోనూ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఐదు శాతం నిధులు పెరిగాయనీ, ఆ స్థాయిలో సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీకి నిధులు కేటాయించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించడంలో ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ 2.5 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తుంటే, మోడీ సర్కారు మాత్రం రూ 86 వేల కోట్లకే పరిమితం చేసింది. ఉత్పత్తి వర్గాలైన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత కార్మికులు, కార్మికులు, సామాజికంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఓబీసీలు, మహిళలను బడ్జెట్ విస్మరించింది. ఆహారభద్రతా చట్టానికి గతంలో 2.70 లక్షల కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రూ 2.04 లక్షల కోట్లకు కుదించడం దుర్మార్గం. గత బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి కోసం రూ 2.60 లక్షల కోట్లు ప్రకటించి కేవలం 1.90 లక్షల కోట్లే ఖర్చుపెట్టారు ఇలాగైతే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. గత బడ్జెట్‌లో తాగునీటి సౌకర్యం కోసం జలజీవన్ పథకానికి రూ 70 వేల కోట్లు ప్రకటించి, రూ 22 వేల కోట్లే ఖర్చుపెట్టారు, ఈసారి బడ్జెట్‌లో రూ 65 వేల కోట్లు కేటాయిస్తున్నామని గొప్పగా చెప్పారు. దేశ జిడిపిలో రూ 70 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రంగం పై అంబానీ, అదానీ లాంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల కన్ను పడింది, అందుకే కేంద్ర ప్రభుత్వం అన్నదాతను సాగుకు దూరం చేసేలా ఎరువుల సబ్సిడీల్లో కోత పెట్టింది, సామాజిక న్యాయానికి పాతరేసింది. దేశంలోని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెబుతూనే, గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 40 శాతం, పట్టణ ప్రాంతాలకు సంబంధించి 60 శాతం నిధుల్లో కోత పెట్టారు.
● విద్యా వైద్య రంగాలను విస్మరించిన కేంద్ర బడ్జెట్.
కేంద్ర బడ్జెట్ విద్యావైద్య రంగాలను విస్మరించిందనొచ్చు. కేటాయింపుల్లో పేపర్ల మీద బాగా చూపి గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ రంగాలకు, సామాన్య ప్రజానీకానికి సంబంధించిన నిధుల్లో కేంద్రం నిర్ధాక్షిణ్యంగా కోతపెడుతున్న తీరును గమనిచోచ్చు. అదే సమయంలో కార్పొరేట్లకు పెద్ద ఎత్తున ఇస్తున్న పన్నుల రాయితీలను చూడొచ్చు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇచ్చే స్కాలర్ షిప్పుల నిధుల్లో 22 శాతం కోతపెట్టి, ఆ వర్గాల పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేయడం అనే ఆలోచన జరుగుతున్నదనొచ్చు. ఇది ఆధిపత్య భావజాల బడ్జెట్ కాకపోతే ఇంకేమవుతుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబందించిన పోషక్-1, పోషక్-2 పథకాల్లో రెండింటికి బడ్జెట్‌లో కోతపడింది. గత బడ్జెట్‌లో వైబ్రెంట్ ఇండియా పథకానికి రూ 1000 కోట్లు కేటాయించి రూ 209 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. మొత్తంగా చూస్తే ఇది కార్పొరేట్ల అనుకూల బడ్జెట్‌లా ఉంది తప్ప ప్రజల బడ్జెట్ లా లేదు అన్నది అందరి అభిప్రాయం.


0 Comments