ఖమ్మం, ఫిబ్రవరి 28, బిసిఎం10 న్యూస్.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఖమ్మం రూరల్, కరుణగిరి టిఎన్జిఓస్ కాలని శ్రీ విద్యానికేతన్ లో 'సైన్స్ ఫెస్ట్' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫెస్ట్ లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రాజెక్ట్ మోడల్స్ వాటర్ సేవర్, సోలార్ ఎనర్జీ, హ్యూమన్ బాడీ పార్ట్స్, కొన్ని ఫిజిక్స్ సూత్రాలపైన ప్రదర్శించారు. అన్ని తరగతుల నుంచి ముఖ్యంగా ప్రైమరీ ఒకటి నుండి ఐదు తరగతుల నుంచి విద్యార్థులు ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని ప్రదర్శించడం కొసమెరుపు. విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చి చురుగ్గా పాల్గొన్నారు. వారి వారి ప్రాజెక్టు మోడల్స్ ను అర్థం అవ్వడానికి ఉపాధ్యాయులు ప్రొజెక్టర్ / టివి స్క్రీన్స్ యూస్ చేసి చిత్రాలను, వీడియోలను ప్రదర్శించడం ఆకర్షణ గా నిలిచాయి. ఈ సందర్బంగా స్కూల్ డైరెక్టర్ వెంకట సత్యనారాయణ యాదవ్, ప్రిన్సిపాల్ శ్రీలక్మి మాట్లాడుతూ మున్ముందు విద్యార్థుల ఆలోచనా శక్తి పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ ప్రాజెక్ట్స్ మోడల్స్ ఆకర్షణీయంగా తయారు చేయడానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని కొనియాడారు. ప్రతి విద్యార్థి సృజనాత్మకతకు అద్ధంపట్టేలా ఈ సైన్స్ ఫెస్ట్ నిర్వహించడం గొప్ప విషయమని విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను అభినందించారు. అలానే ప్రాజెక్ట్ మోడల్స్ ను ఇంత బాగా ప్రిపేర్ చేసి ప్రదర్శన చేయడానికి ముఖ్య కారణమైన వైస్ ప్రిన్సిపాల్ షెహనను, ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఇతర వి
ద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments