![]() |
భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయంలో ఈరోజు అనగా ది 14 .02.2025 న. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథి పురా(అవంతిపురం సమీపంలో) కారుతో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ) సి ఆర్ పి ఎఫ్ సైనికులు మరణించిన రోజు ఈరోజు ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో రిటైర్డ్ ఏఎస్ఐ బైరు నరసింహారావు ఆధ్వర్యంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. నాయకులు సుబ్బయ్య చౌదరి. నాళం సత్యనారాయణ. విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. ఎస్ రాజబాబు. మురళీకృష్ణ. బందు నరసింహారావు. దాసు. ఐలయ్య. రాంబాబు. పంపన సత్యనారాయణ. పరిటాల సుబ్బారావు. బి రాజు. తదితరులు పాల్గొన్నారు.

0 Comments