Breaking News

Loading..

రైతులు ఆరుతడి పంటలను మాత్రమే వేయాలి : ఇరిగేషన్ ఇంజనీర్ రాంప్రసాద్.


 భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు నియోజకవర్గం అధ్యక్షతన, కార్యనిర్వాహక ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ భద్రాచలం సమక్షంలో తాళి పేరు ప్రాజెక్టు రైతులతో రైతు వేదిక సత్యనారాయణపురం నందు సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో తాళి పేరు ప్రాజెక్టు కింద 2024- 25 సంవత్సరమునకు గాను యాసంగి పంటకు, రొటేషన్ పద్ధతిలో ఈ సంవత్సరం జోన్-!! ఎడమ కాలువ పరిధిలోని ఆర్డి-8(కి.మీ11.034) నుండి ఆర్ డి-24(కి.మీ 39.800) డిస్ట్రిబ్యూటరీ వరకు గల ఆయకట్టకు సాగునీటిని 31 మార్చి 2025 వరకు నేటి సరఫరా చేయుటకు నిర్ణయించామని అన్నారు. ప్రస్తుతం ఈ రోజున ప్రాజెక్టు నీటి నిలువ +73.72మీ. మరియు సామర్థ్యము 455 మిలియన్ ఘనపు అడుగులు ఉన్నది, కానీ ఇన్ఫ్లో రోజురోజుకి పడిపోతున్న దృష్ట్యా యాసంగి పంటకు సంబంధించి సాగునీటిని వారబంది పద్ధతిలో పై అధికారుల సూచన మేరకు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారము నీటిని విడుదల చేయడం జరుగుతుందని, కావున జోన్ -ll ఆయకట్టు రైతులు గమనించి, ప్రణాళిక ప్రకారం పంపిణీ చేసే నీటిని, ఆరుతడి పంటలకు సద్వినియోగం పరుచుకుంటూ, ఇరిగేషన్ శాఖ వారికి సహకరించవలసిందిగా ఆయన కోరారు. 

    వార-బంది అమలుపరచు తేదీలు. 

   05-02-25 నుండి 13-02-25 వరకు 9 రోజులు నీటి సరఫరా జరుగుతుందని, 14-02-25 నుండి 20-02-25 వరకు ఏడు రోజులు నీటి సరఫరా నిలుపుదల ఉంటుందని, 21-02-25 నుండి 01-03-25 వరకు తొమ్మిది రోజులు నీటి సరఫరా జరుగుతుందని, 02-03-25 నుండి 08-03-25 వరకు ఏడు రోజులు నీటి సరఫరా నిలుపుదల ఉంటుందని, 09-03-25 నుండి 17-03-25 వరకు 9 రోజులు నీటి సరఫరా జరుగుతుందని, 18-03-25 నుండి 24-03-25 వరకు ఏడు రోజులు నీటి సరఫరా నిలుపుదల ఉంటుందని, 25-03-25 నుండి 31-03-25 వరకు ఏడు రోజులు నీటి సరఫరా ఉంటుందని ఆయన తెలుపుతూ ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

Post a Comment

0 Comments